NZB: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను అటకెక్కించిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఇవాళ నిజామాబాద్‌లో నిర్వహించిన సుదర్శన్ రెడ్డి అభినందన సభలో ఆయన మాట్లాడారు. ప్రజాధనాన్ని కాళేశ్వరం పేరుతో గోదావరిలో పోసిన ఘనత కేసీఆర్‌దే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 నెలల్లో రూ. 21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసి కాంగ్రెస్ మాట నిలబెట్టుకుందన్నారు.