KNR: వీణవంక మండలం చల్లూరు గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్ విద్య కమిషన్ ఛైర్మన్ ఆకునూరు మురళి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు. విద్యార్థులను వివరాలు తెలుసుకున్నారు. విద్యా బోధనతో పాటు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో చక్కని విద్య బోధిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు.