కృష్ణా: గూడూరు,పెడన మండలాల్లో కలెక్టర్ బాలాజీ గురువారం విస్తృతంగా పర్యటించి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వరి పైరు, తేమ శాతం పరీక్షించు పరికరాలు, గోతం సంచులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాన్యం కొనుగోలుకు వ్యవసాయ గ్రామ సహాయకులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు.