ADB: ఈ నెల 26వ తేదీన ఆదిలాబాద్ పట్టణంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు భారతీయ బౌద్ధ మహా సభ రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రజ్ఞ రత్నజాడే తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం జిల్లా పాలనాధికారి రాజర్షి షాకు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. భారత రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తప్పకుండ కార్యక్రమానికి రావాలన్నారు.