GNTR: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబు గురువారం వీధి కుక్కల నిర్వహణపై కీలక సూచనలు చేశారు. ప్రతి వీధి కుక్కకు ABC/ARV ఆపరేషన్లు నిర్వహించి, వాటిని పట్టుకున్న ప్రాంతంలోనే తిరిగి వదులుతామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో కుక్కలు లోపలికి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.