ATP: బెలుగుప్పలో దారుణం జరిగింది. భార్య శాంతిని భర్త ఆంజనేయులు కొడవలితో దారుణంగా నరికి చంపాడు. భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో గొడవపడి, కోపంతో ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం నిందితుడు ఆంజనేయులు స్వయంగా బెలుగుప్ప పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.