HNK: కమలాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తౌటం ఝాన్సీరాణి రవీందర్ గురువారం సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఐకేపీ అధికారులకు సూచించారు. రైతులు సౌకర్యంగా ధాన్యం అమ్మేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.