KMM: ముదిగొండ మండలం గంధసిరిలోని ఇందిరమ్మ మహిళా డెయిరీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఇవాళ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని సూచించారు. పశుగ్రాసం సరఫరా, షెడ్ల నిర్మాణం వంటి పనులను ఉపాధి హామీ ద్వారా పూర్తి చేయాలని పేర్కొన్నారు.