TG: కాచిగూడ రైల్వే ట్రాక్‌పై కారు కలకలం రేపింది. ట్రాక్‌పై ఓ దుండగుడు కారు వదిలి వెళ్లాడు. దీంతో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కారులో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. బాలాజీ అనే వ్యక్తి పేరుపై ఈ కారు రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిపారు. ఈ క్రమంలో కాచిగూడ రైల్వే ట్రాక్ దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు.