W.G: పెనుగొండ నగరేశ్వర మహిషాసుర మర్దిని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ గురువారం దర్శించుకున్నారు. ఆమెకు స్థానిక మహిళ భక్తులు ఆలయ పూజారి, అతని కుమారునిపై ఫిర్యాదు చేశారు. అలయానికి వస్తున్న తమపై పూజారి, అతని కుమారుడు దుర్భాషలాడుతున్నరన్నారు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.