మహారాష్ట్రలోని పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆరు వాహనాలను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు. ట్రక్కు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆరు వాహనాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.