MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వన దుర్గమ్మ దివ్య క్షేత్రం సన్నిధానంలో గురువారం సాయంత్రం ఆలయ నిర్వాహకులు ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు వన దుర్గమ్మకు అర్చకులు ప్రదోషకాల పూజలు అభిషేకం మంగళహారతి చేశారు. స్థానిక ధ్వజస్తంభం వద్ద పూజలు చేసి ఆకాశదీపం ఆవిష్కరించి దర్శించుకున్నారు.