MBNR : చిన్న చింతకుంట మండలంలోని అల్లిపూర్ గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని గ్రామస్తులు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డికి గురువారం విన్నవించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుని నియమించాలని ఆయనను కోరారు. మధుసూదన్ సానుకూలంగా స్పందించి టీచర్ను నియమించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు.