KDP: బహిరంగ మల విసర్జన వల్ల ఆరోగ్య సమస్యలు, పరిసర కాలుష్యం తప్పవని, ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లనే వాడాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యుడు మలగం ప్రసాద్ కోరారు. గురువారం కడపలోని పుట్లంపల్లి చెరువు కట్టపై వాకర్స్‌తో కలిసి అవగాహన కార్డులు ప్రదర్శించారు. బహిరంగ విసర్జనతో డయేరియా, కామెర్లు వంటి అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయన్నారు.