ప్రకాశం: రాచర్ల మండలంలోని ఆకవీడు, జేపీ చెరువు గ్రామాలలో మిరప, బత్తాయి పంటను గురువారం ఉద్యాన శాఖ అధికారి శ్వేత పరిశీలించారు. ఈ సందర్భంగా మిరప పంటలలో లద్దె పురుగు వ్యాపించిందని దాని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి రైతులకు వివరించారు. అనంతరం బత్తాయి పంటలో నల్లమంగు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అధికారి శ్వేత రైతులకు వివరించినట్లు ఆమె పేర్కొన్నారు.