ATP: పుట్లూరు మండలంలోని సుబ్బరాయ సాగర్ నుంచి నీటిని విడుదల చేసినట్లు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తెలిపారు. పుట్లూరు, కోమటికుంట్ల, గరుగు చింతలపల్లి, బొప్పేపల్లి చెరువులకు నీరు చేరేలా చర్యలు చేపట్టామన్నారు. 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల కలను నెరవేర్చుతూ రూ. 3 కోట్ల నిధులతో కెనాల్ పూడికతీత, మరమ్మతులు పూర్తి చేశామని ఆమె పేర్కొన్నారు.