SRCL: పేదల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ వెలుముల స్వరూపా తిరుపతి రెడ్డి అన్నారు. తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లిలో ఇందిరమ్మ ఇళ్లను ఇవాళ ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు సంక్షేమ పలాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడూ కాంగ్రెస్ అండగా ఉంటుందని పేర్కొన్నారు.