భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రేపు ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఖాయమని టీమిండియా సహాయ కోచ్ డస్కాటే పేర్కొన్నాడు. వాళ్లను ఎదుర్కోవడం సవాలే అని చెప్పాడు. అయితే, సౌతాఫ్రికా నుంచి ఎదురయ్యే స్పిన్ దాడిని ఎదుర్కోడానికి తమ బ్యాటర్లు సిద్ధంగా ఉన్నట్లు డస్కాటే వెల్లడించాడు.