AP: ఏనుగుల దాడిలో రైతు కిట్టప్ప(70) మృతిపై డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కుప్పం మండలం వెంకటేశ్వరపురంలో ఏనుగుల దాడిలో మృతి చెందిన కిట్టప్ప కుటుంబానికి రూ.10 లక్షలు అందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లోకి ఏనుగులు వచ్చే సమయంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.