GDWL: లోక కళ్యాణం కోసమే ‘జన కళ్యాణ్ దివాస్’ కార్యక్రమం చేపట్టినట్లు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు తెలిపారు. గురువారం ఇటిక్యాల మండల కేంద్రంలో కార్యకర్తలతో కలిసి ఆయన విరాళాలు సేకరించారు. బహుజనుల ఆర్థిక సహాయంతో ఏర్పడిన ప్రభుత్వాలే వారి అభివృద్ధికి దోహదపడతాయని, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు.