AP: విశాఖలో సీఎం చంద్రబాబుతో తైవాన్ బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో పరిశ్రమల స్థాపనకు సీఎం సమక్షంలో తైవాన్ ప్రతినిధి బృందంతో అధికారులు ఎంవోయూలు చేసుకున్నారు. అనంతరం ఇటలీ రాయబారితో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇటాలియన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటుపై చర్చించారు. దీనికి వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.