MBNR: జిల్లా ఆసుపత్రిలో తల్లులు, శిశువులకు ప్రైవేట్ వైద్యుల ద్వారా ఉచిత ఓపీ సేవలు అందించేందుకు ఐఎంఎ సహకరిస్తుందని శుక్రవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు నాణ్యమైన వైద్యం పూర్తిగా ఉచితంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, వైద్య అధికారులు పాల్గొన్నారు.