వైట్ బ్రెడ్‌లో గ్లైసీమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. దీన్ని తింటే రక్తంలో చక్కెరస్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఈ బ్రెడ్ మంచిది కాదు. ఈ బ్రెడ్ తరచూ తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అయితే, వైట్ బ్రెడ్‌కు బదులుగా బ్రౌన్ బ్రెడ్, హోల్ గ్రెయిన్ బ్రెడ్ తింటే మంచిది.