తన భార్య తరచూ ఇంటికి వీధి కుక్కలను తీసుకొస్తుందని ఓ వ్యక్తి విడాకుల కోసం హైకోర్టుకు ఆశ్రయించాడు. ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. కుక్క ఒకసారి తనను కరిచినప్పటికీ తన భార్య ప్రవర్తనలో మార్పు రాలేదని వాపోయాడు. ఆమె వల్ల మానసిక వేదనకు గురయ్యానని పేర్కొన్నాడు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఇరువురికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబరు 1కి వాయిదా వేసింది.