అన్నమయ్య: సంబేపల్లి మండలం గాండ్లపల్లిలో శుక్రవారం సాయంత్రం జరిగిన దుర్ఘటనలో 8వ తరగతి చదువుతున్న షణ్ముఖ వెంకట సాయి (13) అనే బాలుడు మృతి చెందాడు. ఇంటి వద్ద ట్రాక్టర్ పనులు జరుగుతుండగా, ప్రమాదవశాత్తు మిల్లర్ కింద పడిపోవడంతో విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న సంబేపల్లి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు.