UAE-Aపై 32 బంతుల్లోనే సూపర్ సెంచరీతో చెలరేగిన IND-A యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(144) సొంత రికార్డును బ్రేక్ చేశాడు. IPL 2025లో 35 బంతులకే శతకం బాదిన అతను నిన్నటి మ్యాచ్లో దానికంటే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. అలాగే భారత్ తరఫున ఫాస్టెస్ట్ T20 సెంచరీ చేసిన ప్లేయర్గా రిషభ్ పంత్(32) సరసన నిలిచాడు. అటు రోహిత్ శర్మ(35) రికార్డునూ బ్రేక్ చేశాడు.