GNTR: పొన్నూరులోని సహస్ర లింగేశ్వరస్వామి, శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గద్దె వెంకట అమర్నాథ్ తెలిపారు. పొన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ప్రత్యేక క్యాంపు ఉంటుందన్నారు. స్తానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.