VSP: మహారాణి పేట పోలీస్ స్టేషన్లో తొమ్మిది సంవత్సరాల బాలుడు కనిపించడం లేదని వచ్చిన ఫిర్యాదు అందింది. దీంతో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టగా.. వరుణ్ బీచ్ సమీపంలో శుక్రవారం సాయంత్రం బాలుడు ఆచూకీ లభ్యమైంది. బాలుడి కుటుంబ సభ్యులకు పోలీసులు క్షేమంగా అప్పగించారు. దీంతో సీపీ శంఖబ్రత బాగ్చి పోలీస్ సిబ్బందిని అభినందించారు.