బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. అయితే, మొత్తం 243 స్థానాలకు NDAకు కనిష్ఠంగా 130, గరిష్ఠంగా 167 స్థానాలు వస్తాయని సర్వే సంస్థలు తెలిపాయి. మహాగఠ్‌బంధన్‌కు కనిష్ఠంగా 70, గరిష్ఠంగా 108 స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి. కానీ, అందుకు భిన్నంగా NDA ఏకంగా 202 స్థానాల్లో గెలుపొందగా, MGB కేవలం 35 స్థానాలకే పరిమితమైంది.