AP: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు 6 నెలల్లోగా రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మెగా డీఎస్సీ 671వ ర్యాంకు సాధించిన రేఖ ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. తమకు పోస్టులు కేటాయించకపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. దీంతో కోర్టు రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది.