TG: సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల కాలంలోనే రూ.3.48 లక్షల కోట్ల అప్పులు చేశారని BRS MLC దాసోజు శ్రవణ్ విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని కుదేలు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ను సర్వనాశనం చేశారని.. అనుభవం లేని సీఎం ఉంటే ఇంతకంటే ఏం జరుగుతుందని ఎద్దేవా చేశారు. హైడ్రా పేరిట RR ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ధ్వజమెచ్చారు.