PDPL: సింగరేణి ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రామగుండంలో పారామెడికల్ కోర్సుల దరఖాస్తు గడువును నవంబర్ 27 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ నరేందర్ తెలిపారు. డీఎంఎల్టీ, డయాలసిస్ టెక్నాలజీ కోర్సుల్లో చెరో 30 సీట్లు ఉన్నట్లు వెల్లడించారు. బైపీసీ విద్యార్థులు ఇందుకు అర్హులన్నారు. సీట్లు ఖాళీగా ఉంటే MPC విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు.