BHPL: సీసీఐ కేంద్రాల్లో పత్తిని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులను ఆదేశించారు. BHPL లోని మంజునగర్ కాటన్ మిల్లులో గురువారం సీసీఐ కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర ప్రారంభించారు. క్వింటాకు రూ.8,010 మద్దతు ధర చొప్పున కొనుగోలు చేయాలని సూచించారు. ఎకరాకు 7 క్వింటాళ్ల నిబంధన సడలించి 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని ఆదేశించారు.