ASF: 42 శాతం BC రిజర్వేషన్లు సాధించడమే తమ లక్ష్యమని బీసీ జేఏసీ జిల్లా ఛైర్మన్ రమేశ్ అన్నారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ JAC ఆధ్వర్యంలో ధర్మదీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలన్నారు.