HYD: రేపు యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని HYD నగర జాయింట్ CP తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే చర్యలు తప్పవని హెచ్చరించారు.