ASR: అరకులోయ మండలం పరిధిలోని బస్కి గ్రామ పంచాయతీ జాకర వలస గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ కారుణ్య రామాలయ విగ్రహాన్ని ప్రతిష్టించారు. విగ్రహా ప్రతిష్టకు ముఖ్య అతిథులుగా అరకు జెడ్పీటీసీ రోషిని, వైస్ ఎంపీపీ రామన్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు తరలి వచ్చారు. గిరిజ సంప్రదాయ పద్ధతిలో థింసా నృత్యంతో అలరించారు.