KDP: ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు సింహాద్రిపురం ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి గురువారం తెలిపారు. దీంతో సదరం స్లాట్ బుకింగ్ నవంబర్ 14న ప్రారంభమవుతుందన్నారు. పూర్తి వివరాలకు సచివాలయంలో సంప్రదించి దివ్యాంగ సర్టిఫికెట్ పొందవచ్చన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.