ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ కొత్త అసిస్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను నియమించింది. ఈ విషయాన్ని KKR యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా, ఇప్పటికే అభిషేక్ నాయర్‌ను కొత్త హెడ్ కోచ్‌గా నియమించిన విషయం తెలిసిందే.