VZM: ఆంధ్రప్రదేశ్ మాదిగ వేల్ఫేర్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ లిమిటెడ్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ఈమేరకు జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు డి.వెంకటేశ్వర రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొనాలని అన్నారు.