NZB: మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడిన 8మందికి జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ గురువారం తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI ప్రసాద్ తెలిపారు. ఇందులో ఆరుగురికి 7 రోజులు, ఒకరికి 5 రోజులు, మరొకరికి 4 రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. కాగా, వాహనదారులు రోడ్డు భద్రతానిబంధనలను పాటించాలని సూచించారు.