KNR: జిల్లాలోని నిరుద్యోగులకు కరీంనగర్ కళ్యాణి జ్యువెల్లర్స్లో ఈనెల 18న జాబ్ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతి రావు తెలిపారు. 60 పోస్టులు ఉన్నాయని, డిగ్రీ పూర్తి చేసి వయస్సు 19-30 సంవత్సరాలలోపు ఉండలన్నారు. వేతనం రూ. 20,000 ప్రారంభమని, ఆసక్తి గల అభ్యర్ధులు ఈనెల 18న ఉదయం 11 గంటలకు ప్రతిమ మల్టిఫ్లెక్స్, కళ్యాణి జ్యువెల్లర్స్ షో రూమ్ వద్ద ఇంటర్వూకి హాజరు కావలని సూచించారు.