KDP: అంకాలమ్మ గూడూరులోని VHA మోసంపై రైతులు మండిపడుతున్నారు. గురువారం సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులో రైతులు ధర్నా చేశారు. లక్ష్మీనరసమ్మ మాట్లాడుతూ.. VHAకి శనగలు, ఎరువుల కోసం డబ్బులు కట్టామని ఆయన మోసం చేసి ఉడాయించారన్నారు. మోసపోయిన రైతులతో అధికారులు చర్చించిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.