కృష్ణా: కంకిపాడు మండలంలోని ఉప్పలూరు నుంచి ఈడుపుగల్లు వరకు రోడ్లను బాగు చేయాలంటూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర చేపట్టారు. అధికారులు తక్షణమే రోడ్లు బాగు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పంచకర్ల రంగారావు, కంకిపాడు మండల కార్యదర్శి టీ నరేష్ ,మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.