SKLM: వజ్రపుకొత్తూరు మండలం ఎల్డీపేట గ్రామంలోని మండల ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండుతుండగా ప్రెజర్ కుక్కర్ పేలడంతో ముగ్గురు మహిళలకు గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో బైనపల్లి మోహిని, బైనపల్లి హేమ, మువ్వల దశమి గాయాలు కావడంతో… చికిత్స నిమిత్తం హుటాహుటిన పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వండుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.