HYD: బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్లో రైతు విశ్రాంతి భవనం అధ్వానంగా మారి, వినియోగంలో లేకపోవడంపై మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆనంద్ బాబు గౌడ్ స్పందించారు. భవనం శిథిలావస్థకు చేరడంతో, మరమ్మతులు చేయాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులు విశ్రాంతి తీసుకోవడానికి మన కూరగాయల కేంద్రంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.