గుంటూరు లాడ్జ్ సెంటర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన బి. విల్సన్ ఉద్యమానికి గురువారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, జాషువా భవనాల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. అలాగే డా. అంబేద్కర్ భవనంలోని నాగార్జున స్టడీ సెంటర్లో కోచింగ్ సెంటర్ను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.