ADB: బజార్ హత్నూర్ మండలంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తన వంతు సహాయంగా ఆలయ అభివృద్ధికి రూ. 21,000 వేలు విరాళం ఇచ్చారు. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.