ఆదిలాబాద్: ప్రమాద సమయాల్లో రైతులకు అండగా నిలిచేందుకు పంట బీమా ఉంటేనే రైతులకు ధీమాగా ఉంటుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో హెడావ్ దీపక్ అనే రైతు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల నిల్వ ఉంచిన పత్తి దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం బాధిత రైతు ఇంటికి వెళ్ళి ప్రమాదంలో దగ్ధమైన పత్తిని పరిశీలించి భరోసా ఇచ్చారు.