NLG: వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం నల్గొండ రెవెన్యూ డివిజన్ కార్యదర్శిగా కట్టంగూర్ ఎస్సీ హాస్టల్ వార్డెన్ గుజ్జుల శంకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నల్గొండ టీఎన్జీవో భవన్లో జరిగిన ఎన్నికల్లో ఆయనను ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి రామకృష్ణారెడ్డి తెలిపారు. వసతి గృహ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.