కేంద్రం వైఫల్యం వల్లే ఢిల్లీలో పేలుడు జరిగిందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశ రాజధానిలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని.. ఇందులో కేంద్ర నిఘా సంస్థల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. IB, CIB వంటి అత్యున్నత ఏజెన్సీలు ఉన్నప్పటికీ విఫలమైందని విమర్శించారు.